మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 16వ తేదీ వరకు బనగానపల్లెలో అందుబాటులో ఉండటం లేదని ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో సోమవారం స్పష్టం చేసింది. కావున కూటమి నేతలు, కార్య కర్తలు, అభిమానులు, ప్రజలెవరూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు బనగానపల్లెలోని కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని మంత్రి బీసీ కార్యాలయం సూచించింది.