గత ప్రభుత్వంలోని రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడమైనదని ఆర్ఐ రాఘవేంద్ర బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ రాఘవేంద్ర మాట్లాడుతూ.. బనగానపల్లె, మిట్టపల్లె గ్రామంలో గత ప్రభుత్వంలో రీ సర్వేలో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి రైతులు నుండి వచ్చిన 35 వినతులను స్వీకరించమన్నారు.