నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ రాణా, డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ఉత్తర్వుల ప్రకారం, బనగానపల్లె సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవుకు రాజా రెడ్డి సిబ్బంది దేవాలయాలలో దొంగతనం చేసే ముఠాను అరెస్ట్ చేశారు. సోమవారం బెలూంగుహల దగ్గర కొండపల్లి కమల నాథ్, మైనర్ బాలుడిని పట్టుకున్నారు. పంచాలోహ విగ్రహాలు, విజ్ఞేశ్వర, సుబ్రమణ్యేశ్వర విగ్రహాలకు అలంకరించేందుకు ఉపయోగించే వెండి, బంగారు వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.