కర్నూల్ జిల్లా వెలుగోడు లోని స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకేషనల్ ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యుత్ సరఫరా మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో వొకేషనల్ ఉపాధ్యాయుడు మహేష్ విద్యార్థులను స్థానిక విద్యుత్ కేంద్రానికి తీసుకెళ్లి ప్రత్యక్ష అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి తమ పాఠశాలలో ఎలక్ట్రానిక్ & హార్డ్వేర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యుత్ ఉపకేంద్రం అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఆపరేటర్ అల్తాఫ్ హుసేన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.