డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చ్యువల్ (ఆన్ లైన్ )ద్వారా 220 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడ్డ నంద్యాల జిల్లాకు మీ సహాయ, సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబును కోరారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.