పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 14వ తేదీ బేతంచెర్ల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరుగు ప్రజా పోరు ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బేతంచెర్ల పట్టణ ప్రజలకు పట్టణ కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు బుధవారం పిలుపునిచ్చారు. బేతంచర పట్టణంలోని సంత మార్కెట్, కోటపేట, అంగళ్ళబజారు తదితర కాలనీలలో ప్రజా పోరులో భాగంగా ప్రజా సమస్యలపై సిపిఎం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.