సోమవారం స్థానిక తెలక పల్లి నరసింహయ్య భవనంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం ఆరోగ్యం అధ్యక్షతన జరిగింది. ఈ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ కోయలకొండ నాగరాజు మాట్లాడుతు సినిమా, టీవీ సీరియల్ వలన విష సంస్కృతి పెరిగిపోయిందని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విష సంస్కృతిని పెంచి ప్రోత్సహిస్తూ, ప్రాచిన కళలను కనుమరుగు చేస్తున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు,