Feb 07, 2025, 08:02 IST/
ఇన్ఫోసిస్ మైసూరు ఆఫీసులో లేఆఫ్‌లు.. 400 మంది ట్రైనీల తొలగింపు
Feb 07, 2025, 08:02 IST
కర్ణాటక మైసూరులోని ఇన్ఫోసిస్ ఆఫీసులో లేఆఫ్‌ల పర్వం ప్రారంభమైంది. ఒకేసారి 400 మంది ట్రైనీలను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ సంస్థ మూడు సార్లు నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమవడంతో వారిని ఉద్యోగం నుంచి తీసేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. 2024 అక్టోబరులో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందికి ఇప్పుడు ఉద్వాసన పలికినట్లు ఈ కథనాల బట్టి వెల్లడవుతోంది.