రీల్స్ అతిగా చూడడం వల్ల కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుల చెబుతున్నారు. రీల్స్ చిన్నగానే ఉండొచ్చు.. కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రీల్స్ స్థిరంగా అలా చూడటం వల్ల బ్లింకింగ్ రేటు 50శాతం తగ్గుతోంది. ఇది కళ్లు పొడిబారడానికి, దృష్టిలోపాలకు దారితీస్తుందని అంటున్నారు.