రాష్ట్రంలో పరిశుభ్రతనే స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ లక్ష్యమని కోడుమూరు ఈవో అజయ్ భాస్కర్, సర్పంచ్ భాగ్యరత్న అన్నారు. శనివారం కోడుమూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మండల అధికారులు, గ్రామ సర్పంచ్ భాగ్యరత్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతినెలా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు, మండల పరిషత్ ఆఫీసర్లు, పరిశుద్ధ్య కార్మికులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.