గూడూరు మండలంలోని జులకల్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ విద్యావతి ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. శనివారం గూడూరులో ఎంపీపీ సునీత ఆధ్వర్యంలో సమావేశాన్ని ఎంపీడీవో శివనాగప్రసాద్ నిర్వహించారు. జులకల్ లో ఫ్లోరైడ్ తో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పైపులైను నిర్మాణం చేపట్టి తాగునీటిని అందించాలని సర్పంచ్ కోరారు. సమస్యను పరిష్కరిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సనా చెప్పారు.