
నందవరం: ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తగవు
నందవరం మండలం టి.సోమల గూడూరు పరిధిలోని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణపై చర్యలు తగవు అని టి.సోమల గూడూరు గ్రామానికి చెందిన నాయని నాగరాజు, గ్రామీణ ఉపాధి హామీ పథకం సభ్యులు గురువారం అన్నారు. ఇంత వరకు నందవరం మండలంలో ఎలాంటి అవినీతి మరక లేకుండా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పై ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు.