ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్లు పేర్కొన్నారు. ఫోన్‌కాల్ చేసిన వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు తెలిపారు.