గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి
మద్దికేర మండల కేంద్రానికి సమీపాన ఉన్న మల్లప్ప గేటు దగ్గర సోమవారం తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు అని గుంతకల్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తించలేకపోయామన్నారు. ఎవరైనా గుర్తిస్తే గుంతకల్లు ఆర్పీఎఫ్ స్టేషన్ ఫోన్ నెంబర్ కు 9550111589 తెలపాలని కోరారు.