మహానంది: అంగన్వాడి కేంద్రంలో దీపావళి వేడుకలు
మహానంది మండలం అబ్బీపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో దీపావళి వేడుకలను ఘనంగా బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ చంద్రలీల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి, కాకర పూలు కాలుస్తూ, పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషాల మధ్య నిర్వహించుకోవాలని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి అని అన్నారు.