గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ లోని గురువారం AMB సినిమాస్ వద్ద పోలీసులు పలు ఆంక్షలు విధించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినిమా ఈవెంట్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, శంకర్ చేరుకోవడంతో AMB సినిమాస్ దగ్గర పోలీసులు, బౌన్సర్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు వంటి హడావుడి లేకుండా.. కేవలం టికెట్ ఉన్న వారినే లోపలికి అనుమతించారు.