క్రీడలతో ఆరోగ్యం, ఆనందం సాధ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లు చెప్పారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కడ్తాల్ ప్రీమియర్ లీగ్-3 క్రికెట్ పోటీలను వారు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఉత్తేజాన్ని కలిగించి అహల్లాదాన్ని అందిస్తాయని, ఆటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.