భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మహానంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బారావు మంగళవారం తెలిపారు. మహానంది మండల కేంద్రంలోని తిమ్మాపురం గ్రామంలో అంకాలమ్మ గుడి ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా, భూ సమస్యలకు సంబంధించిన అన్ని రకాల ఫిర్యాదులను గ్రామసభలోనే అందజేయవచ్చని చెప్పారు. అనంతరం, రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల వినతులను గ్రామసభలో స్వీకరించారు.