కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో భక్తులు వేలాదిగా శ్రీమఠానికి వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తుల సందడితో శ్రీమఠం లోని కారిడార్ ప్రాంగణం, పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిశాయి.