ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటక రాష్ట్రం బెంగళూరు ఏడిజీపి నంజుండ స్వామి ఆదివారం విచ్చేశారు. ముందుగా శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావణాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ప్రసాదాలు అందజేశారు.