పెద్దకడబూరు మోడల్ స్కూల్లో మండల విద్యాధికారులు సువర్ణల సునియం, రామ్మూర్తి యూటీఎఫ్ డైరీ, అధ్యాపక దర్శిని క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఉపాధ్యా యుడు పనిచేయాలని ఎంఈవోలు సూచించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి. కౌలన్న మాట్లాడుతూ. యూటీఎఫ్ డైరీ, అధ్యాపకదర్శిని ఉద్యోగులకు, ఉపాధ్యా యులకు అనేక సందేహాలను పరిష్కారానికి దిక్సూచి లాంటిదని తెలిపారు.