ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ నేతలు

602చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరుపున శుక్రవారం టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ యువనేత రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు యంకన్న, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అమలు చేసే ఆరు గ్యారంటీల గురించి వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఆరు గ్యారంటీలతో అందరికీ మేలు జరుగుతుందని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్