నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయని నేషనల్ హైవే అధికారులు ఆదివారం తెలిపారు. ఈ పనులు పూర్తయితే నందికొట్కూరు, నంద్యాల నుండి ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని వారు తెలియజేశారు. వాహనదారులు రోడ్డు పై ఉన్న సిగ్నల్స్ చూసుకొని వెళ్లాలని వారు తెలిపారు.