రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వాల్మీకి బోయ సంఘం నియోజకవర్గ నాయకులు గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు, యం బి. రాంబాబు, విజయ శేఖర్, పసుల శ్రీనివాసులు నాయుడు లు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నందికొట్కూరు పట్టణం లో వాల్మిక బోయ సంఘం నాయకులు గుజ్జుల గౌరీశ్వర్ సమావేశం నిర్వహించారు.