కొత్తపల్లి మండల పరిధిలోని గోకవరం గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీవో మేరీ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అందివ్వాలన్నారు. మెనూ ప్రకారంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని గర్భిణీ స్త్రీలను, బాలింతలను ఆరా తీశారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆకుకూరలను, పండ్లను తీసుకోవాలని సూచించారు.