నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామంలో త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ స్టోరేజ్, పంప్ హౌస్ ను ఎమ్మెల్య జయసూర్య, మున్సిపల్ కమిషనర్ తో కలిసి శనివారం సందర్శించారు. పట్టణ ప్రజలకు త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ స్టోరేజ్ పంప్ హౌస్ ను పరిశీలించారు. పంప్ హౌస్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బేబీ, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.