ఈనెల 12 నుండి 16 వరకు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే అండర్ - 14 బాలుర ఫెన్సింగ్ జాతీయ క్రీడలలో పాల్గొనే ఏపీ జట్టు కోచ్ గా నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చౌట్కూరు, కడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, ముస్తాహీర్ లను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ శనివారం తెలిపారు.