రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇక రక్షణ కరువేనని నంద్యాల జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. సోమవారం పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన చిన్నారి వాసంతి (9) కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చెక్కు రూపంలో అందజేశారు. వారు మాట్లాడుతూ ఘటన జరిగి 122 రోజుల అవుతున్న చిన్నారి వాసంతి ఆచూకీ జాడ కనిపెట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నియోజకవర్గ వైసిపి బాద్యులు సుధీర్ అన్నారు.