నంద్యాలజిల్లా చెంచుల జీవన ప్రమాణాల పెంపుకు సర్వే నిర్వహించండి

54చూసినవారు
నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని చెంచు గూడెంలలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పకడ్బందీ సర్వే నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో చెంచుల జీవన ప్రమాణాల సర్వేపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకట శివప్రసాద్, డిపిఓ జమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్