నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల సబ్ డివిజన్ కు సంబందించి నేర సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి వివరాలు మరియు పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.