గోస్పాడు: ఆదర్శ పాఠశాల విద్యార్థులకు10 రోజుల ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్

69చూసినవారు
గోస్పాడు: ఆదర్శ పాఠశాల విద్యార్థులకు10 రోజుల ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్
సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన 10 రోజుల ఇంటర్నషిప్ ప్రోగ్రామ్ ను గోస్పాడు ఆదర్శ పాఠశాల విద్యార్థలు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో శిక్షణ పొందుతున్నారు. శనివారం స్టేట్ ఆఫీసర్ మంగ వృత్తివిద్య శిక్షణలో ఉన్న విద్యార్థుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. వృత్తివిద్య కోర్సుల పట్ల రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు, స్వయం ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఖాజాహుస్సేన్, డిస్ట్రిక్ ఒకేషనల్ కోఆర్డినేటర్ మద్దిలేటి, సుధీర్, వృత్తి విద్య ఉపాధ్యాయులు నరేష్ , విజయమ్మ, సమీనా పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్