నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయం వెనుక భాగంలో ట్రాన్స్ఫార్మర్ పక్కన ఎక్కడో కొట్టేసిన చెట్ల కొమ్మలను ఇక్కడ పడేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెట్ల వల్ల వాహనదారులు, బాటసారుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా రోడ్డుపైన చెట్లను వేయడం ఎంతవరకు సబబు అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే అక్కడి నుంచి చెట్లు తొలగించాలని స్థానికులు కోరారు.