నంద్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, క్వింటల్ కు 3000రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ ఫెడ్ ద్వారా మొక్క జొన్న రైతుల నుండి కొనుగోలు చేయాలని సీపీఐ, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. నంద్యాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు వినతిపత్రాన్ని అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, కార్యదర్శి ఎస్. బాబాఫక్రుద్దీన్ పాల్గొన్నారు.