వెలుగోడులో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

74చూసినవారు
వెలుగోడులో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం మండల ప్రజా పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ లాలం రమేష్ అధ్యక్షతన, ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మండలంలోని పలు గ్రామాల్లో సమస్యలపై చర్చ జరిగింది. ఎంపీపీ గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్