నందికొట్కూరు: అన్న క్యాంటీన్ ఏర్పాట్లను పరిశీలించిన వైస్ చైర్మన్ రబ్బాని

85చూసినవారు
నందికొట్కూరు: అన్న క్యాంటీన్ ఏర్పాట్లను పరిశీలించిన వైస్ చైర్మన్ రబ్బాని
నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్కు ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని ఆదివారం రాత్రి అన్ని వసతులు సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షాలు, టిడిపి నాయకులు జమీల్, రసూల్, సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్