నంద్యాల పట్టణం ఎస్.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, బహుళ జాతి సంస్థల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులుతమ అనుభవాలను పంచుకున్నారు. కళాశాల అభివృద్ధికి తమ తోడ్పాటును ఎప్పటికప్పుడు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వేడుకకు కళాశాల అధినేత వెంకట రామి రెడ్డి, దినేశ్ రెడ్డిలు అతిథిలుగా హాజరయ్యారు