నంద్యాల: అదుపుతప్పిన బైక్.. మహిళకు గాయాలు

76చూసినవారు
నంద్యాల: అదుపుతప్పిన బైక్.. మహిళకు గాయాలు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పరిధిలోని శనివారం రోజు వెంకట కొండాపురం గ్రామానికి చెందిన కొండా లక్ష్మీదేవి కుమారుడు కొండ చిరంజీవి ఇద్దరూ కలిసి పొలం పనులు ముగించుకుని సొంత గ్రామానికి బయలుదేరారు. చంద్ర పల్లి దగ్గర రోడ్డు కిలోవైపులా పైపులైను పనులు జరుగుతుండగా జేసీబీని తప్పించబోయి అటువైపు నుండి మరో వాహనం ఎదురుగా వచ్చింది. దీంతో బైకును పక్కకు తిప్పడంతో బండి పై నుండి లక్ష్మీదేవి కింద పడిపోయింది. ఆమెకు తలకు, చేయికి గాయాలవడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్