నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కోరారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. గత రెండు సంవత్సరాల నుండి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగలేదని అన్నారు. వైద్యంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు. సూపరింటెండెంట్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.