నంద్యాల సంగపేటలోని ఓ టీచర్ ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. టీచర్ ప్రమీల దేవి ఆరోగ్య పరిస్థితి బాగా లేక శనివారం సాయంత్రం తన చెల్లి ఇంటికి వెళ్ళింది. ఇంటి పక్కన ఉన్న స్థానికులు సోమవారం సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసింది. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని రూ. 20 వేల నగదు, 8 తులాల బంగారు, 500 గ్రాముల వెండి దొంగలు అపహారించారని బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు.