నంద్యాల జిల్లాలో 105 మద్యం షాపులకు సంబంధించి జరగనున్న వేలం పాట ప్రక్రియ నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద గల సెంటినరీ హాల్ నందు సోమవారం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం తెలిపారు. మొత్తం 131 మంది పోలీసు అధికారులు వారి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, రాముడు , ఇన్స్పెక్టర్లు సూర్యమౌళి పాల్గొన్నారు.