హైకోర్టును కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలని నంద్యాల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. గత వైకాపా ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, న్యాయ కళాశాల, లోకాయుక్త వాటిని కర్నూల్ లోనే ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని విజయవాడకు తరలించేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు.