నంద్యాల జిల్లాలో శంకుస్థాపన చేసిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గనుల శాఖ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.