నంద్యాల జిల్లాలో పోలీస్ శాఖలో సాధారణ బదిలీలలో భాగంగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 143 మంది పోలీసు సిబ్బందికి శనివారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో బదిలీలు చేశారు. ఈ బదిలీల్లో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఎంత మంది వచ్చారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని వాటి ఆధారంగా బదిలీలు చేశారు.