ఎదుగుదలను ఓర్వలేకనే దాడి చేశారు-ప్రధాన కార్యదర్శి ఫిరోజ్

74చూసినవారు
తనపై జరిగిన దాడి రాజకీయ కుట్ర అని న్యాయశాఖ మంత్రి కుమారుడు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సోమవారం తెలిపారు. నంద్యాల టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఒక వ్యక్తి మధ్యాహ్నం నుంచి తనకు ఫోన్ చేసి విసిగిస్తున్నారని తెలిపారు. తర్వాత ఆ నెంబర్ ని బ్లాక్ చేశానని తెలిపారు. రాత్రి సమయంలో కాపు కాసి నలుగురు దాడి చేయడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు

సంబంధిత పోస్ట్