గోస్పాడు మండల జడ్పీ స్కూల్, కేజీబీవీ స్కూల్లో 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులతో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తదనంతరం పాఠశాలలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.