సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో ట్రాన్స్ జెండర్ ల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.