నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిడిపి నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో ఈ శుభవార్త తెలియజేశారు. సోమవారం ఉదయం క్యాంటీన్ ప్రారంభించబడుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య హాజరవుతారని తెలిపారు.