సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం కొంగనపాడులో మండల ప్రత్యేక అధికారి దీప్తి ఆధ్యక్షతన చేపట్టిన ఇది మంచి ప్రభుత్వంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 16437 పోస్టులకు మోగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగ యువతకు అండగా నిలిచిందన్నారు.