తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం విశిష్టతపై ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు ధార్మిక ప్రవచన సప్తాహం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓర్వకల్లులో ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. శ్రీజీవేశ్వర స్వామి ఆలయంలో ప్రవచన సప్తాహం ఉంటుందని తెలిపారు.