ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరష్కరించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం ఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే చరితారెడ్డి మాట్లాడారు. బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలన్నారు.